News December 4, 2025

WGL: సోషల్ మీడియానే మొదటి ప్రచార అస్త్రం..!

image

ఉమ్మడి ఓరుగల్లులో జీపీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దేవాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు, ఇళ్ల పంపిణీ, శుద్ధి నీటి సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, చమత్కార స్లోగన్లు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.

Similar News

News December 4, 2025

రుద్రంగి మండలంలో ఏకగ్రీవం అయిన పంచాయతీలివే

image

రుద్రంగి మండలంలో ఏడు పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. చింతామణి తండా, రూప్లా నాయక్ తండా, వీరుని తండా, అడ్డబోర్ తండా, బడి తండా, గైదిగుట్ట తండా, సర్పంచ్ తండా ఏకగ్రీవం అయిన జాబితాలో ఉన్నాయి. వీటిలో మూడు పంచాయతీల్లో సింగిల్ నామినేషన్ రాగా, మిగతా నాలుగు పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యాయి. ఏడు పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా పూర్తిగా ఏకగ్రీవం కావడం విశేషం.

News December 4, 2025

SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>SIDBI<<>>)లో 14 కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA, CMA, MBA, PGDM ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.లక్ష చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in/

News December 4, 2025

నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

image

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.