News January 29, 2026

WGL: స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ది స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ (ఎస్‌జీవో)లో స్కౌట్ మాస్టర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ బానేష్ జాడి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం లోగా హన్మకొండ కేయూ రోడ్డులోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాల కోసం 96526 95670 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 11, 2026

NRPT జిల్లాలో 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

image

నారాయణపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన వివరాలు:

మద్దూరు: 74.37% (టాప్)
కోస్గి: 67.86%
నారాయణపేట: 63.69%
మక్తల్: 63.10% జిల్లా సగటు 66.38 శాతంగా నమోదైంది. ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

News February 11, 2026

ఖమ్మం కలెక్టరేట్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ

image

ఖమ్మంలోని ఐదు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ బుధవారం కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 117 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని ఐదు ప్రత్యేక స్క్రీన్లపై పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా వెబ్ క్యాస్టింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

News February 11, 2026

RR: GREAT ఓటేసిన 103 ఏళ్ల రామయ్య

image

మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 103 ఏళ్ల రామయ్య తన ఓటు హక్కును వినియోగించుకుని యువకులకు ఆదర్శంగా నిలిచారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌కి చెందిన రామయ్య అదే వార్డులోని పోలింగ్ కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వీల్ ఛైర్‌పై వచ్చి తన వార్డుకు చెందిన తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. ఓటు విలువ ఇప్పటికైన కొందరు తెలుసుకోవాలని సూచించారు.