News January 8, 2026
WGL: ‘స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ప్రతిపాదించాలి’

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ.4170 కోట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సమాంతరంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ప్రతిపాదించాలని MLAలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపై గురువారం జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి డీపీఆర్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 4, 2026
NCERTలో 117 ఉద్యోగాలు

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. అర్హులు FEB 20 వరకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు www.ncert.nic.in చూడండి.
News February 4, 2026
MGU: బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ‘చివరి అవకాశం’

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2011-12 నుంచి 2015-16 వరకు చదివిన బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 4 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు ఫీజు చెల్లించవచ్చని ఎగ్జామినేషన్ కంట్రోలర్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాక్‌లాగ్ విద్యార్థులు తమ పెండింగ్ పేపర్లు క్లియర్ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు.
News February 4, 2026
మహబూబ్‌నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


