News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News January 9, 2026
విడుదలైన కొత్త వంగడాలు.. రైతులకు ఎన్నో లాభాలు

నువ్వులు, సజ్జ, పొగాకు, వరిగ పంటల్లో కొత్త వంగడాలను ఆచార్య N.G.రంగా అగ్రికల్చర్ వర్సిటీ అభివృద్ధి చేసింది. వీటిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా జాతీయ స్థాయిలో విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే YLM 146 నువ్వుల వంగడం, ఎక్కువ పోషకాలు గల APHB 126 సజ్జ, PMV 480(అల్లూరి) వరిగ, ABD 132 బీడీ పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 9, 2026
‘కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు పటిష్ఠంగా అమలు చేయాలి,

స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, సమర్థవంతంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’ రివ్యూ&రేటింగ్

నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే ‘రాజాసాబ్’ స్టోరీ. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే, స్లో ఫస్ట్ హాఫ్, అనవసరం అనిపించే సాంగ్స్, సీన్లు మైనస్. స్టోరీ టెల్లింగ్ వీక్‌గా ఉంది. ప్రేక్షకులు కనెక్ట్ కారు. కొన్నిచోట్ల బోర్ కొడుతుంది.
రేటింగ్: 2.25/5


