News April 13, 2025

WGL: హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?..

image

వరంగల్(D) నల్లబెల్లి(M) మూడు చెక్కలపల్లిలో శనివారం బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి <<16081748>>హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News September 15, 2025

గృహ హింస బాధితులకు వరంగల్ పోలీసుల సహాయ హామీ

image

గృహ హింసపై ప్రతి ఒక్కరూ గళం ఎత్తాలని వరంగల్ పోలీస్‌ శాఖ పిలుపునిచ్చింది. బాధితుల హక్కులను కాపాడడంలో సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తక్షణ సహాయం కోసం గృహ హింస బాధితులు ఎప్పుడైనా డయల్ 100కు కాల్ చేయవచ్చని, 24 గంటల సహాయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

News September 15, 2025

MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.

News September 15, 2025

నిజామాబాద్: ఈనెల 17న ప్రజాపాలన వేడుకలు

image

ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టర్ చర్చించారు. వేడుకకు ముఖ్య అతిథిగా సWఎం సలహాదారు నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముకులు రానున్న నేపథ్యంలో లోటు పాట్లు లేకుండా చేయాలన్నారు.