News February 25, 2026
WGL: 17 మంది వైద్యులపై వేటు

రాష్ట్రంలో విధులకు హాజరుకాక దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 17 మంది ఉన్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై విధుల్లో చేరని వారిని తొలగించారు.
Similar News
News April 14, 2026
భద్రాచలం కోసం ఢిల్లీలో పోరాడతాం: రేణుక చౌదరి

భద్రాచలం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి స్పష్టం చేశారు. ‘సమరభేరి’ సభలో ఆమె మాట్లాడుతూ.. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తానని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాడుతానని హెచ్చరించారు. దశలవారీగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో నేతలు, ప్రజలు హాజరయ్యారు.
News April 14, 2026
GNT: పుల్లలు ఏరుకొని వస్తూ.. రైలు కిందపడి మహిళ స్పాట్ డెడ్!

గుంటూరు (D) దుగ్గిరాల మండలం చిలువూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతూ ఎన్. కుమారి (45) అనే మహిళ దుర్మరణం పాలయ్యారు. పొలంలో ఎండు పుల్లలు ఏరుకొని వస్తుండగా, తీవ్రమైన ఎండ ధాటికి అప్రమత్తత కోల్పోయి రైలు వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేకపోయారు. దీంతో వేగంగా వచ్చిన రైలు చక్రాల కింద పడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదం నింపింది.
News April 14, 2026
గుంతకల్లు యువతికి జపాన్ ఆహ్వానం

గుంతకల్లు విద్యార్థిని కే జ్యోతికి జపాన్ నుంచి అరుదైన అవకాశం లభించింది. ఆమె రూపొందించిన ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ ప్రాజెక్టును గుర్తించిన జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ‘సకుర’ కార్యక్రమం కింద ఆమెను ఆహ్వానించింది. సోలార్ విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ టెంట్‌లో వెలుగు, ఫ్యాన్ వంటి సౌకర్యాలు ఉండటం విశేషం. జ్యోతి సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని పలువురు ప్రశంసలు కురిపించారు.


