News February 16, 2025
WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News October 27, 2025
కరీంనగర్: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
News October 27, 2025
నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>
News October 27, 2025
శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 4 ట్రెయినీ డాక్ పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఎస్సీ నాటికల్ సైన్స్, సెకండ్ మేట్(FG)/డ్రెడ్జ్ మేట్ గ్రేడ్ 1 అర్హతగల అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. రాతపరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://smp.smportkolkata.in/


