News February 16, 2025
WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News April 17, 2026
డీసెట్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు: డీఈవో

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇంటర్ అర్హతతో రెండేళ్ల డీఎల్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్‌కు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో డా.ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో వెలువడుతున్నాయని వివరించారు. వివరాలకు cse.a p.gov.in, apdeecet.apcfss.in ను సంప్రదించాలని సూచించారు.
News April 17, 2026
ఖమ్మం: భానుడి భగభగ.. మూగజీవాల విలవిల

ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 42 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనంతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు అడవుల్లో నీరు దొరక్క మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం, మట్టి తవ్వకాలు పెరగడంతో దుప్పులు, అడవి పందులు, కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
News April 17, 2026
ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గాల పెంపుపై చర్చ!

ఉమ్మడి జిల్లాలో జనాభా ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనున్నట్లు చర్చ సాగుతోంది. HNKలో 2 నుంచి 5, WGLలో 3 నుంచి 4, MHBDలో 2 నుంచి 4, BHPLలో 1 నుంచి 2 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. జనగామలో సరిహద్దుల మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. MLG యధాతథంగా కొనసాగనుంది. మొత్తం కొత్తగా 7 అసెంబ్లీ స్థానాలు పెరగడంతో పాటు మరో లోక్‌సభ స్థానం కూడా ఓరుగల్లుకు వచ్చే అవకాశముంది.


