News February 16, 2025
WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News February 26, 2026
మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి.. MLCల వినతి

AP: శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎదుట విచారణకు హాజరైన MLCలు బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరారు. ఈ సందర్భంగా రాజీనామాలకు గల కారణాలపై ఛైర్మన్ వారిని ప్రశ్నించారు. ‘రాజీనామా ఎందుకు చేశారు. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా?’ అని అడిగారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని వెంటనే అంగీకరించాలని జవాబిచ్చారు. వీరికి ఛైర్మన్ నోటీసులివ్వగా ఇవాళ హాజరై వివరణ ఇచ్చారు.
News February 26, 2026
బాపట్ల: ఎన్ని వాహనాలు స్వాధీనం చేసుకున్నారంటే..!

బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించి 40 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల పట్టణ పరిధిలో 10, రూరల్ పరిధిలో 3, చందోలులో 3, కర్లపాలెంలో 5, పర్చూరులో 12, యద్దనపూడిలో 7 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు 47 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 26, 2026
హన్మకొండ: 98 శాతం మంది విద్యార్థుల హాజరు

జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షకు తొలి రోజు గురువారం 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్, వొకేషనల్ కలిసి మొత్తం 18,768 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్ట్ డే ఎగ్జామ్‌కు 18,375 మంది విద్యార్థులు హాజరయ్యారు. 393 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు వెల్లడించారు.


