News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Similar News

News November 10, 2025

గద్వాల: ప్రజావాణికి 61 ఫిర్యాదుల వెల్లువ

image

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారులకు సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

News November 10, 2025

సంగారెడ్డి: టీచర్లను సర్దు బాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామని పేర్కొన్నారు.

News November 10, 2025

భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> నోయిడా 10 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, డిప్లొమా, MD, MS, DNB, MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు ప్రొఫెసర్‌కు రూ.2.22లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.47లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.27లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/