News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Similar News

News July 7, 2025

VJA: త్వరలో రైతులకు యాన్యుటీ నగదు

image

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అందించే వార్షిక యాన్యుటీ (కౌలు) చెల్లించేందుకు విజయవాడలోని CRDA అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. జరీబు, మెట్ట భూమి ఇచ్చిన వారికి ఇచ్చే కౌలును ప్రభుత్వం మరో 5ఏళ్లు పొడిగించిన నేపథ్యంలో రైతుల ఖాతాలలో నగదు జమ చేసేందుకు అర్హుల జాబితాలు రూపొందించే ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు 10ఏళ్ల పాటు రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు అందజేసింది.

News July 7, 2025

కంది: ఐఐటీహెచ్ డైరెక్టర్ పదవీ కాలం పెంపు

image

కందిలోని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పొడిగించడం ఆనందంగా ఉందన్నారు. ఐఐటీహెచ్‌లో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

News July 7, 2025

టేస్టీ ఫుడ్: వరల్డ్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం

image

రుచికరమైన వంటకాల్లో బెస్ట్ సిటీ మన హైదరాబాద్ అని మరోసారి నిరూపితమైంది. టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ ఫుడ్‌ లభించే నగరాల్లో HYDకు 50వ స్థానం దక్కింది. HYD బిర్యానీ, హలీమ్, ఇరానీ ఛాయ్, తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ, మొఘల్, టర్కిష్ రుచులు సిటీలో ఏ మూలకు వెళ్లిన లభిస్తాయి. అందరికీ అందుబాటులోనే ధరలు ఉండటం విశేషం. మరి సిటీలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది? కామెంట్ చేయండి.