News May 17, 2024
WGL: 5,68,165 లక్షల మంది ఓటుకు దూరం
వరంగల్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 13న జరిగిన ఎన్నికలలో 5,68,165 లక్షల మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్థానం పరిధిలో 18,44,66 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో 12,55,361 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ స్థానం మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తే 70 శాతాన్ని కూడా అందుకోలేకపోయింది. మహిళల కన్నా పురుషులే అధికంగా ఓటేశారు.
Similar News
News January 24, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News January 24, 2025
దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి: కలెక్టర్
సంగెం మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై వచ్చిన దరఖాస్తులను ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తప్పులు దొర్లకుండా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 23, 2025
వరంగల్ మార్కెట్‌కి అరుదైన మిర్చి ఉత్పత్తుల రాక
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. ఎల్లో మిర్చి క్వింటా రూ.18 వేలు, 2043 రకం మిర్చి రూ.14 వేలు, 273 రకం మిర్చి రూ. 12వేలు, హరిణి మిర్చి రూ.14 వేలు, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది.అలాగే పాత తేజా మిర్చి ధర రూ.13,300, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.13,600, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.