News February 26, 2026

WGL: 7 కాలేజీలు.. 1,980 సీట్లు..!

image

పాలిసెట్ (POLYCET) 2026-27 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండగా, మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 7 పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 1,980 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాటారం పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది నుండి కొత్తగా ‘డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్’ కోర్సులు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.

Similar News

News February 28, 2026

పెళ్లి రోజు వర్షం పడితే అశుభమా?

image

పెళ్లి రోజు వాన పడటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘వర్షాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. వివాహ సమయంలో వర్షం కురిస్తే ఆ నూతన వధూవరులు అదృష్టవంతులని, వారు జీవితాంతం సిరిసంపదలతో, సంతానంతో కలకాలం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇది వారి కొత్త జీవితంలో ఎదుగుదలకు, శుభారంభానికి సంకేతం. అయితే ఈ విషయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి’ అంటున్నారు.

News February 28, 2026

ESIC రాయ్‌పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ESIC<<>> రాయ్‌పూర్‌(C.G.) 6 సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పీజీ, డిప్లొమా/DNB అర్హత గలవారు మార్చి 6వరకు ms-raipur@esic.gov.inకు e మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మార్చి 11న ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,41,899 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 28, 2026

WGL: కాసేపట్లో నింగిలోకి ‘రుద్రమ-1’ రాకెట్

image

భద్రకాళి బండ్ వేదికగా ‘రుద్రమ-1’ మోడల్ రాకెట్‌ను శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రయోగించనున్నారు. 250 గ్రాముల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ చిట్టి రాకెట్ శాస్త్ర సాంకేతిక రంగంపై ఆసక్తి ఉన్న వారిని ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్, బాల్సా ఉడ్, ఫైబర్ వంటి తేలికపాటి పదార్థాలతో దీనిని రూపొందించారు. ప్రయోగం తర్వాత ఇది సుమారు 3 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంటుందని అంచనా.