News March 31, 2026
WGL: 8,297 మందికి షాక్!

ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరిలో గరిష్ఠ వినియోగం కారణంగా 8,297 మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకం దూరమైంది. 200 యూనిట్ల పరిమితి దాటడంతో వీరికి జీరో బిల్లుల బదులు చెల్లింపులు తప్పలేదు. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మార్చిలో మరికొందరికీ జీరో బిల్లు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 4 రోజుల్లో బిల్లులు రానున్నాయి
Similar News
News April 3, 2026
పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.458

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో <<19319137>>రెండో సారి<<>> పెట్రోల్, డీజిల్ ధరలను అక్కడి ప్రభుత్వం పెంచింది. 42.7% పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్థానీ రూపాయలకు చేరింది. డీజిల్ రేటు 55% పెరిగి 520 PKRకి ఎగసింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పాయని, దీంతో ధరలు పెంచక తప్పలేదని పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ అన్నారు.
News April 3, 2026
ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 3, 2026
MDK: నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

చిన్నశంకరంపేట మండలంలోని టీ. మాందాపూర్ తండాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రణయశ్రీ ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. తండాకు చెందిన ప్రసాద్-తిరుమల దంపతుల కుమార్తె ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో పడిపోవడంతో.. గమనించే లోపే ఊపిరి ఆడక మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


