News March 27, 2025
WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News April 2, 2025
వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూను ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్లో కలిశారు. హెచ్‌సీయూ పరిధిలో వివిధ జంతు- వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలను కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News April 2, 2025
వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.
News April 2, 2025
హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

TG: హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్‌ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.