News March 20, 2025
WGL: GREAT.. తండ్రి కల నెరవేర్చిన పేదింటి బిడ్డ!

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మౌనిక భద్రాద్రి జోన్‌లో 9వ ర్యాంకుగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా సాధించాలని కన్న తండ్రి కలను ఎట్టకేలకు కూతురు నెరవేర్చింది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మౌనిక సగృహానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 23, 2026
మక్తల్: ముగిసిన సీఎం కప్ కబడ్డీ పోటీలు

మక్తల్‌లో నిర్వహించిన సీఎం కప్ కబడ్డీ పోటీలు సోమవారంతో ముగిశాయి. క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై ఆసక్తి చూపాలని మంత్రి సూచించారు.
News February 23, 2026
ఏలూరు జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే!

ఏలూరు జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News February 23, 2026
అనంతపురం: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన బి.ఫార్మసీ 3-1, 3-2 (R15, R19, R23) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


