News June 4, 2024

WGL, MHBDలో సర్వం సిద్ధం!

image

WGL, MHBD ఎంపీ స్థానాల ఓట్ల లక్కింపునకు సర్వం సిద్ధమైంది. WGL ఎంపీ స్థానంలో WGL తూర్పు లెక్కింపు తొలుత పూర్తవనుండగా.. ఆ తర్వాత PLKY, వర్ధన్నపేట, WGL పశ్చిమ, PRKL, BHPL, ఘనపూర్ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 125 టేబుళ్లకు గాను 18 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు. MHBD ఎంపీ స్థానంలో MHBD, NSPT, పినపాక, భద్రాచలం, ఇల్లందు, డోర్నకల్, ములుగు సెగ్మెంట్లలో 112 టేబుళ్లకు గాను 22 రౌండ్లలో లెక్కించనున్నారు.

Similar News

News September 18, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,810

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. ఈరోజు రూ.7,810కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News September 18, 2024

పద్మాక్షి అమ్మవారి శరన్నవరాత్రులకు రావాలని సీఎంకు ఆహ్వానం

image

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవికి వచ్చేనెల 3 నుంచి 14 వరకు శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-గీతా రెడ్డి దంపతులను పద్మాక్షి అమ్మవారి దేవాలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని కలిసి ఆహ్వానించారు. సీఎంకు అమ్మవారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.

News September 18, 2024

రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

image

రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన విజ్ఞాన్(32) తల్లి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తల్లికి ఏమైనా జరుగుతుందేమోనని భయాందోళనకు గురైన విజ్ఞాన్ చింతలపల్లి రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.