News March 26, 2025
WGL: WOW సూపర్ ఐడియా.. సమ్మర్ స్పెషల్ ఆటో

మహబూబాబాద్ జిల్లాలో ఎండ వేడిని తట్టుకోవడానికి ఓ ఆటో యజమాని వినూత్నంగా ప్రయత్నించాడు. తన ఆటోలో పచ్చని చెట్లను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు ఆ ఆటోను ఎక్కడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. పచ్చని చెట్లు లేకపోవడం వలనే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందరూ చెట్లను పెంచాలని ఆటోడ్రైవర్ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాడు.
Similar News
News December 12, 2025
SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇబ్రహీంపట్నం: ఉత్కంఠకు తెర.. సర్పంచ్గా గోపి గెలుపు

ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్ ఫలితంపై కొనసాగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్గా బద్దం గోపి విజయం సాధించారు. గోపి తన సమీప అభ్యర్థి పిట్టల వంశీపై 474ఓట్ల తేడాతో విజయం సాధించారు.