News March 26, 2025
WGL: WOW సూపర్ ఐడియా.. సమ్మర్ స్పెషల్ ఆటో

మహబూబాబాద్ జిల్లాలో ఎండ వేడిని తట్టుకోవడానికి ఓ ఆటో యజమాని వినూత్నంగా ప్రయత్నించాడు. తన ఆటోలో పచ్చని చెట్లను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు ఆ ఆటోను ఎక్కడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. పచ్చని చెట్లు లేకపోవడం వలనే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందరూ చెట్లను పెంచాలని ఆటోడ్రైవర్ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాడు.
Similar News
News April 1, 2025
చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎంపీ కావ్య

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అందజేశారు. అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కడియం కావ్య అన్నారు. హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన Md. నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్‌కు వైద్య చికిత్స కోసం అందించామని వరంగల్ ఎంపీ కావ్య తెలిపారు.
News April 1, 2025
శివనగర్: ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా.. కత్తితో దాడి

శివనగర్ ప్రాంతంలోని సబ్ స్టేషన్ వద్ద యువకుడిపై కత్తితో దాడి జరిగింది. ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడనే నెపంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. గాయపడిన యువకుడికి కత్తిపోటుతో పాటు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. మిల్స్ కాలనీ పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడు మైసయ్య నగర్‌కు చెందిన కందుల వినయ్‌గా పోలీసులు గుర్తించారు.
News April 1, 2025
వరంగల్: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సురేఖ

వరంగల్ పట్టణ పరిధిలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇలా ఖిల్లా ఈద్గాలో ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నెల రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి రంజాన్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.