News March 27, 2025

WGL: ఈ వారంలో పత్తికి భారీ ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

Similar News

News April 1, 2025

అమెరికాలో అత్యధిక పెట్స్ ఏవంటే?

image

అమెరికన్లు పెంపుడు జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగైదు రకాల పెట్స్ కూడా ఉంటుంటాయి. అయితే, అత్యధికంగా కుక్కలను పెంచుకునేందుకు వారు మొగ్గుచూపుతున్నట్లు అమెరికన్ పెట్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ తెలిపింది. USలో 65 మిలియన్ల పెట్ డాగ్స్ ఉండగా 47M పిల్లులున్నాయి. ఫ్రెష్ వాటర్ ఫిష్‌లు 11M, చిన్న జంతువులు 7M, పక్షులు 6M, రెప్టైల్స్ 6M, సాల్ట్ వాటర్ ఫిష్ – 2M, గుర్రాలు 2M ఉన్నాయి.

News April 1, 2025

MDK: వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్‌ నంబర్లు

image

మెదక్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు సహాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, పీఏలకు సంబంధించిన అధికారుల నంబర్లు మారినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదివరకు ఐడియా వొడాఫోన్ నంబర్లు ఉండగా ఎయిర్ టెల్‌లోకి మారాయి.

News April 1, 2025

A+ కాంట్రాక్టులోనే విరాట్, రోహిత్?

image

విరాట్, రోహిత్‌ను A+ గ్రేడ్‌లోనే కొనసాగించాలని BCCI భావిస్తున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకే బీసీసీఐ A+ గ్రేడ్‌ను కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి గ్రేడ్‌ను తగ్గించొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, భారత క్రికెట్‌కు వారందించిన సేవల దృష్ట్యా అగ్రస్థాయి కాంట్రాక్ట్‌లోనే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!