News February 6, 2025

WGL: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్, ఆర్.ఆర్.బీ, ఎస్.ఎస్.సి. ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు https://tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 15 నుంచి శిక్షణ ఉంటుందన్నారు.

Similar News

News February 6, 2025

సమాజంలో కుల విషం చిమ్ముతున్న కాంగ్రెస్: మోదీ

image

అవినీతి, కుటుంబమే కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ అని PM మోదీ విమర్శించారు. మైనారిటీలను బుజ్జగించడమే వారికి తెలుసన్నారు. ప్రస్తుతం వారు సమాజంలో విభజన, ఆందోళన, కుల విషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. కొందర్ని బుజ్జగించేందుకే కాంగ్రెస్ OBC ప్యానెల్‌ను అడ్డుకుందన్నారు. తమది ప్రత్యామ్నాయ ప్రభుత్వ మోడలని, తాము అందరి వికాసాన్ని కోరుకుంటామని తెలిపారు. ప్రజలు తమను మూడోసారి ఎన్నుకున్నారని గుర్తుచేశారు.

News February 6, 2025

పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.

error: Content is protected !!