News March 26, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మక్కలు (బిల్టి) క్వింటాకి సోమవారం రూ. 2265 పలకగా.. మంగళవారం రూ.2,250 పలికింది. బుధవారం మరింత తగ్గి రూ.2245కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయ క్వింటాకు రూ.6050 ధర రాగా.. పచ్చి పల్లికాయకి రూ.4300 ధర వచ్చింది.
Similar News
News April 1, 2025
నారాయణపేట: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

నారాయణపేట మండల పరిధిలోని కందేన్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు బోయిని రఘువర్ధన్ ఇండియన్ నేవీ ఆర్మీ జాబ్ సాధించాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి జాబ్ సాధించాడు. నేవి జాబ్ సాధించిన రఘువర్ధన్‌కు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
News April 1, 2025
పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ ఛాంపియన్స్

ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ నిరాశాజనక పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఇప్పటివరకు 3 మ్యాచులాడి రెండింట్లో ఓడింది, ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున నిలిచింది. మరోవైపు ఆర్సీబీ టాప్‌లోనే కొనసాగుతోంది. ఆ తర్వాత DC, LSG, GT, PBKS, MI, CSK, SRH, RR ఉన్నాయి. కాగా ఇవాళ కేకేఆర్‌పై విజయంతో ముంబై ఆరో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.
News April 1, 2025
నాగర్‌కర్నూల్: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. హీనంగా ప్రవర్తించారు..!

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.