News April 7, 2025
WGL: క్వింటా పసుపు ధర రూ.12,126

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పలు చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాల్ ధర రూ.6,500, పచ్చి పల్లికాయ రూ.4,200 పలికింది. అలాగే పసుపు క్వింటాల్ ధర రూ.12,126, మక్కలు(బిల్టీ) క్వింటాల్ ధర రూ.2,280 పలికినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News April 19, 2025
ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్(ఫొటోలో) మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రారంభం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.
News April 19, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్(సెషన్-2) ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ రిలీజ్ చేసిన NTA అధికారులు తాజాగా విద్యార్థుల పర్సంటైల్ స్కోరులో ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ <
News April 19, 2025
సంగారెడ్డి: 21న పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో 21న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి శుక్రవారం తెలిపారు. జాబ్ మేళాలో ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.