News January 6, 2025

WGL: క్వింటా మొక్కజొన్న ధర రూ.2,565

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో మక్కలు(బిల్టీ) క్వింటాకు సోమవారం రూ.2,565 ధర పెరిగింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర గతవారంలాగే రూ.15,500, కొత్త 341 రకం మిర్చికి రూ.15,011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News January 8, 2025

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి: WGL కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారులు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్థులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.

News January 8, 2025

WGL: తరలివచ్చిన పల్లికాయ, పసుపు.. ధర ఎంతంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు నిన్న రూ.6,500 ధర పలకగా.. నేడు రూ.6,610కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,860 ధర రాగా.. నేడు రూ.4,750కి పడిపోయింది. అలాగే క్వింటా పసుపుకి రూ.11,609 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.

News January 8, 2025

WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర క్రమంగా, స్వల్పంగా తగ్గుతూ వస్తున్నది. మక్కలు(బిల్టీ) క్వింటాకు గతవారం రూ. 2570 పలకగా.. సోమవారం, మంగళవారంలు రూ.2,565 ధర పలికాయి. ఈరోజు మరింత తగ్గి రూ.2560 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చికి నిన్న రూ.14,500 ధర రాగా నేడు రూ.14,900 పలికింది. కొత్త 341 రకం మిర్చికి నిన్నటి లాగే రూ. 14 వేలు పలికింది.