News February 3, 2025
WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!
NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 3, 2025
హైదరాబాద్: నుమాయిష్‌కు పోటెత్తారు!
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు పోటెత్తారు. దీంతో స్టాళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇప్పటివరకు నుమాయిష్‌ను దాదాపు 12 లక్షల మంది సందర్శించారు. ఆదివారం మాత్రం 70 వేల మంది విజిట్ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
News February 3, 2025
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన కొత్త మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్ లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.
News February 3, 2025
సౌతాఫ్రికాకు నిధుల్ని నిలిపేసిన ట్రంప్
దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘కొన్ని వర్గాల ప్రజలపై సౌతాఫ్రికా చాలా ఘోరంగా వివక్ష చూపిస్తోంది. వారి భూముల్ని లాక్కుంటోంది. అక్కడి వామపక్ష మీడియా దీన్ని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. ఇలాంటివాటిని చూస్తూ ఊరుకోం. అక్కడేం జరుగుతోందో పూర్తి నివేదిక వచ్చే వరకూ ఆ దేశానికి మా నిధుల్ని పూర్తిగా ఆపేస్తున్నా’ అని పేర్కొన్నారు.