News March 3, 2025

WGL: మక్కలు, పల్లికాయ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు రూ.2,355 పలికింది. గత వారంతో పోలిస్తే మక్కల ధర తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి రూ.5,500 ధర రాగా.. సూక పల్లికాయకి రూ.7,500 ధర వచ్చింది.

Similar News

News March 4, 2025

నర్సంపేట: ఇద్దరికి జైలు శిక్ష

image

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 26వ తేదీన ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన అరవింద్, నర్సంపేట పట్టణానికి చెందిన నాగరాజు పట్టుబడ్డారు. వీరిని నేడు న్యాయస్థానంలో హాజరు పర్చగా మూడు రోజుల జైలు శిక్షతోపాటు  రూ.1,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ తీర్పు ఇచ్చారు.

News March 4, 2025

దుగ్గొండి: అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

image

WGL (D) దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన గందం లక్ష్మీ(52) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీ, మొగిలి దంపతులు బర్రెల వ్యాపారం చేశారు. అందులో నష్టాలు రావడంతో 5ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా దిగుబడి రాలేదు. అప్పులను తీర్చలేక 4 రోజుల క్రితం లక్ష్మీ పురుగుల మందు తాగింది. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.

News March 3, 2025

WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

error: Content is protected !!