News May 4, 2024

WGL: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా, 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.

Similar News

News December 14, 2025

వరంగల్: 18.82% పోలింగ్ @9AM

image

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.

News December 14, 2025

రాంనగర్‌లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.

News December 14, 2025

HNK, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ గుర్తులు లేకున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. నేడు పోలింగ్ అనంతరం వచ్చే ఫలితాలు గ్రామీణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి.