News March 18, 2025
WGL: రైతులకు గుడ్ న్యూస్.. పెరిగిన పత్తి ధర..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పెరిగింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలకగా.. మంగళవారం రూ.6,975కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News March 19, 2025
₹2.4-₹3 లక్షల జీతంతో ఉద్యోగాలు: సీడాప్

AP: జర్మనీలో నర్స్ ఉద్యోగాల కోసం అర్హులైన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర స్కిల్& ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్, సీడాప్ ఓ ప్రకటనలో తెలిపాయి. అభ్యర్థులకు BSc, MSc నర్సింగ్ చదివి, 20-35yrs వయసు, సాధారణ ఆస్పత్రుల్లో పని అనుభవం, జర్మనీ భాష నేర్చుకునేందుకు ఆసక్తి ఉండాలి. ఈనెల 24 నుంచి VJAలోని భవానీపురం సెంటర్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. జీతం నెలకు ₹2.4-₹3L ఇస్తారు.
వివరాలకు ఫోన్: 9963074879, 9492719843
News March 19, 2025
తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమెరికాలోని మిచిగన్‌లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
News March 19, 2025
ఒంగోలు: ఫుడ్, బెడ్‌తోపాటు ఉచిత శిక్షణ

ఒంగోలు గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు నెల రోజులపాటు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నెల రోజులపాటు ఉండే శిక్షణలో భోజనం, వసతి పూర్తిగా ఉచితమన్నారు. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు ఒంగోలు గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి రావాలన్నారు.