News April 3, 2025

WGL: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

image

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

Similar News

News April 4, 2025

విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పోస్టులు వీరికే

image

విజయనగరం జిల్లాలో పలువురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. విజయనగరం, గజపతినగరం, రాజాం మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాజాం ఏఎంసీ ఛైర్‌పర్సన్‌గా పొగిరి కృష్ణవేణి(జనసేన), గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పీ.వీ.వీ గోపాలరాజు(టీడీపీ), విజయనగరం ఏఎంసీ ఛైర్మన్‌గా కర్రోతు వెంకటనర్శింగరావుకు(టీడీపీ) అవకాశం ఇచ్చింది.

News April 4, 2025

ధరూర్ నూతన పోలీస్ స్టేషన్‌కు డీజీపీ భూమి పూజ

image

ధరూర్ మండల కేంద్రంలో రూ.2.65 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే నూతన పోలీస్ స్టేషన్‌కు తెలంగాణ డీజీపీ జితేందర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ధరూర్ మండలానికి ఇప్పటికే జూరాల దగ్గర పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశారు. ఆయన వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

News April 4, 2025

కడప: ఒంటిమిట్టకు 135 ప్రత్యేక బస్సులు

image

కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట క్షేత్రానికి 135 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా అధికారి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కడప 35, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 15, బద్వేలు 20, పులివెందుల 10 ఇతర ప్రాంతాల నుంచి మిగతా బస్సులు ఉంటాయన్నారు.

error: Content is protected !!