News December 2, 2024
వామ్మో.. చిరుద్యోగి ఆస్తి రూ.600 కోట్లు

TG: నీటి పారుదల శాఖ ఏఈఈ <<14757645>>నిఖేశ్ కుమార్<<>> అక్రమ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు షాకవుతున్నారు. శంషాబాద్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడలో విలాసవంతమైన విల్లాలు, తాండూరులో భూమి, మొయినాబాద్‌లో 3 ఫామ్‌హౌస్‌లు, కిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో స్థిర, చరాస్తుల విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Similar News
News November 2, 2025
సచిన్‌తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్‌తో పాటు పలువురిని కలిశారు.
News November 2, 2025
FINAL: టీమ్ ఇండియాకు శుభారంభం

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.
News November 2, 2025
కార్తీకమాసంలో భక్తుల రద్దీ.. ప్రభుత్వం అలర్ట్

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. కార్తీక మాసంలో సోమవారం, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు భక్తులకు మైకుల ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని జిల్లా ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. బారికేడ్లు పటిష్ఠంగా ఉంచాలని సూచించింది. ఒకే ప్రదేశంలో భారీ జనసమూహం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.


