News September 2, 2024
వామ్మో.. వీళ్లిద్దరూ లేకపోతే?

TG: వరద ఉద్ధృతికి పలు చోట్ల రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. MHBD జిల్లా తాళ్లపూసపల్లి సమీపంలో ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్‌మన్ జగదీశ్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి రా.12గంటల సమయంలోనే పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. అటు ఇంటికన్నె వద్ద వరద ప్రభావంతో ట్రాక్ గాల్లో తేలింది. ట్రాక్‌మన్ మోహన్ సమయానికి సమాచారం ఇచ్చారు. దీంతో రైళ్లను నిలిపివేసి ప్రమాదాలను నివారించారు. లేకపోతే వందల మరణాలు సంభవించేవేమో!
Similar News
News December 12, 2025
పాకిస్థాన్‌లో సంస్కృతం, మహాభారతం కోర్సులు

పాకిస్థాన్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లో (LUMS) సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు మహాభారతం, భగవద్గీత శ్లోకాలను సైతం విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. అయితే దీని వెనుక ప్రొఫెసర్ షాహిద్ రషీద్ కృషి ఉంది. రాబోయే 10-15 ఏళ్లలో పాకిస్థాన్ నుంచి భగవద్గీత, మహాభారతానికి చెందిన స్కాలర్లు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 12, 2025
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో స్టార్‌తో తమ కాంట్రాక్ట్ కొనసాగుతుందని ICC స్పష్టం చేసింది. క్రికెట్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో రద్దు చేసుకోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. రానున్న టీ20 WCతో పాటు ICC ఈవెంట్లన్నింటినీ నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై జియో హాట్‌స్టార్‌లో ఫ్రీగా మ్యాచులు చూడలేమనుకున్న యూజర్లకు ఈ ప్రకటన భారీ ఊరట కలిగించింది.
News December 12, 2025
వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సత్యకుమార్

AP: అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘వాజ్‌పేయ్‌కు-నాకు-కర్నూలుకు ఓ అనుబంధం ఉంది. నేను 1993లోనే ఢిల్లీ వెళ్లడంతో వాజ్‌పేయ్‌తో పరిచయమైంది. 2018లో వాజ్‌పేయ్ కీర్తిశేషులయ్యాక ఆయన అస్థికలను ఢిల్లీ నుంచి తెచ్చి నా చేతుల మీదుగా పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే అవకాశం దక్కింది’ అని తెలిపారు.


