News May 3, 2024
వామ్మో.. రిచర్డ్ వచ్చేస్తున్నాడు!

ఏ అంపైర్ పేరు చెప్తే భారత క్రికెట్ ఫ్యాన్స్ భయపడతారో? అతను మళ్లీ వచ్చేస్తున్నాడు. అతడే రిచర్డ్ కెటిల్‌బరో. గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా ఆడిన అన్ని నాకౌట్ మ్యాచుల్లో రిచర్డ్ అంపైర్‌గా ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచులన్నింటిలో భారత జట్టు ఓటమి చవి చూసింది. దీంతో అతణ్ని ఐరన్ లెగ్ అంటుంటారు. ఇప్పుడు అతను మళ్లీ టీ20 వరల్డ్ కప్‌లోనూ అంపైర్‌గా వ్యవహరించనుండటం అభిమానుల్ని కలవరపెడుతోంది.
Similar News
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.
News December 4, 2025
‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.


