News October 8, 2025

ఇంత చిన్న శ్లోకంలో ఎంత పెద్ద భావమో..

image

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే||
తెల్లటి వస్త్రాలు ధరించి, విశ్వమంతా వ్యాపించినవాడా! చంద్రుని తేజస్సుతో పాటు 4 భుజాలు గలవాడా! ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను. నా విఘ్నాలను తొలగించు’ అనేది ఈ శ్లోకార్థం. తెలుపు వస్త్రాలు పవిత్రతకు చిహ్నం. చతుర్భుజాలు పురుషార్థాలను సూచిస్తాయి. సర్వవ్యాపిని ధ్యానించి, కార్యసిద్ధిని కోరే అద్భుత ప్రార్థన ఇది.

Similar News

News February 15, 2026

ఈ 5 స్నాక్స్‌తో గ్లోయింగ్ స్కిన్

image

మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములే కాదు. మనం తినే ఫుడ్ కూడా ముఖ్యమేనని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, అంజీర్‌లోని ఫైబర్ స్కిన్‌ను ఫ్రెష్‌గా ఉంచుతాయి. బీట్‌రూట్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచితే, వేయించిన శనగలు మొటిమలను తగ్గిస్తాయి. పిస్తాలోని విటమిన్-E ముడతలు పడకుండా కాపాడుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ఉప్పు, పంచదార తక్కువగా ఉండే ఈ 5 స్నాక్స్‌ను డైట్‌లో చేర్చుకోండి.

News February 15, 2026

EAPCET.. జోన్ మార్చడం కుదరదు

image

TG: EAPCET-2026 దరఖాస్తులు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 జోన్లు ఏర్పాటు చేశారు. ఒకసారి <>జోన్<<>> సెలక్ట్ చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. అప్లై సమయంలో జాగ్రత్తగా జోన్ ఎంచుకోవాలని సూచించారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9, 10 11 తేదీల్లో ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

News February 15, 2026

AIIMS కల్యాణిలో 137 పోస్టులు

image

AIIMS కల్యాణి 137 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB/MSc/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మార్చి 3,5,6 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in