News March 24, 2024
వాట్ ఏ బౌలింగ్.. 10 ఓవర్లలో 5 మెయిడిన్

ఆస్ట్రేలియా మహిళా ఆల్ రౌండర్ సోఫీ మొలినెక్స్ అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఆమె 10 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులే ఇచ్చారు. అందులో 5 మెయిడిన్ ఓవర్లు ఉండగా 3 వికెట్లు తీశారు. మొత్తం 60 బంతులు వేయగా.. అందులో 53 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఇక ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి హడలెత్తించడంతో బంగ్లా 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 23.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
Similar News
News December 30, 2025
బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా (80) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఇటీవలే ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. జియా పదేళ్ల పాటు (1991-96, 2001-06) బంగ్లా ప్రధానిగా పని చేశారు.
News December 30, 2025
DANGER: అరటి తోటల్లో ఈ మందు పిచికారీ చేస్తున్నారా?

అరటి తోటల్లో కలుపు ప్రధాన సమస్య. దీని కట్టడికి వ్యవసాయ నిపుణులు గ్లూఫోసినేట్ అమ్మోనియం, పారాక్వాట్ సహా పలు కలుపు మందులను సిఫార్సు చేస్తున్నారు. అయితే కొందరు రైతులు అవగాహన లేక 2,4-D రసాయనాన్ని కలుపు మందుగా అరటిలో వాడుతున్నారు. దీని వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ మందుతో పంటకు కలిగే నష్టమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 30, 2025
టీచర్లకు పరీక్ష.. సెలవు పెట్టి మరీ కోచింగ్‌కు

TG: ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ TET తప్పనిసరి కావడంతో 2012కు ముందు చేరిన సీనియర్ టీచర్లు ఇప్పుడు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ కొత్త సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు కొందరు ఏకంగా సెలవు పెట్టి కోచింగ్‌కు వెళ్తున్నారు. జనవరి 3 నుంచి జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వీరికి సవాలుగా మారాయి. దీంతో సాంకేతిక మెలకువల కోసం తమ పిల్లలు, బంధువులపై ఆధారపడుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.


