News July 17, 2024
వారెవ్వా.. 6 నెలల్లో ఎంత మార్పు!
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మెంటల్ ట్రాన్స్ఫామేషన్లోనే కాదు ఫిజికల్ ట్రాన్స్ఫామేషన్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో 2023 WCలో తాను గాయపడ్డప్పటిది, T20 WC విజయం తర్వాతి ఫొటోలను పంచుకున్నారు. హార్డ్వర్క్కు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. హార్దిక్ ట్రాన్స్ఫామేషన్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా హార్దిక్ విడాకులపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2025
ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్
ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటోడ్రైవర్కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా భజన్ సింగ్కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.
News January 22, 2025
పవన్ను ముందు పెట్టి బీజేపీ డ్రామాలు: అద్దంకి
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ‘చంద్రబాబుతో కయ్యం తమ పార్టీ ఉనికికే ప్రమాదమని బీజేపీకి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మిత్ర పార్టీలతో లబ్ధి పొంది, ఆ పార్టీలను అంతం చేయడం బీజేపీకి ఉన్న అలవాటే. రాజకీయ స్వార్థమే ఆ పార్టీని పతనం వైపు నెడుతోంది’ అని విమర్శించారు.
News January 22, 2025
మీ పిల్లలకు ఈ పాటనూ నేర్పించండి!
ఇప్పుడంటే పిల్లలకు ‘ట్వింకిల్.. ట్వింకిల్ లిటిల్ స్టార్’ అంటూ రైమ్స్ నేర్పిస్తున్నారు. కానీ, ఒకప్పుడు తెలుగు పద్యాలు ఎంతో వినసొంపుగా ఉండేవి. ముఖ్యంగా 60లలో ఉండే పద్యాన్ని ఓ నెటిజన్ గుర్తుచేశారు. ‘బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది. పడమటింటి కాపురం చేయనన్నది. అత్త ఇచ్చిన కొత్త చీర కట్టనన్నది. మామ తెచ్చిన మల్లెమొగ్గ ముడువనన్నది. మగని చేత మొట్టికాయ తింటానన్నది’ ఇదే ఆ పాట. ఇది మీరు విన్నారా?