News January 21, 2025
ఎంత పని చేశావ్ ట్రంప్ మావా!

USAలో అక్రమంగా ఉంటున్న వారిపైనే ట్రంప్ చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ వచ్చీ రాగానే లీగల్ ఇమ్మిగ్రెంట్స్కూ షాక్ ఇచ్చారు. USAలో పుట్టే పిల్లల పేరంట్స్‌లో ఒకరికి గ్రీన్ కార్డు/US పౌరసత్వం ఉంటేనే జన్మత: పౌరసత్వం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎవరైనా USAలో పుట్టగానే అక్కడి పౌరులయ్యేవారు. వారి పేరంట్స్ విదేశీయులైతే, కాస్త ఆలస్యమైనా ఆ కపుల్‌కు గ్రీన్ కార్డు వచ్చేది. ఇప్పుడిది కష్టమే.
Similar News
News November 21, 2025
విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.


