News April 17, 2024
ఎలక్షన్ డిపాజిట్ల సంగతేంటి? 2/3

✒అభ్యర్థికి 16.66% లేదా ఆరో వంతు ఓట్లు రాకపోతే అతను జమ చేసిన డిపాజిట్ నగదు తిరిగి ఇవ్వరు.
✒అభ్యర్థి గెలిచినప్పుడో, ఆరో వంతు ఓట్లు వస్తేనో లేదా నిర్దేశిత సమయం కంటే ముందే నామినేషన్ ఉపసంహరించుకుంటే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు.
✒ఇందులో SC, STలకు 50% రాయితీ ✒తొలి ఎన్నికల్లో(1951) ఎంపీ అభ్యర్థులకు రూ.500, MLA అభ్యర్థులకు రూ.100గా ఉండేది. 2009లో EC దీనిని పెంచింది
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 20, 2026
శుక్రుని ఆరాధనతో కళత్ర దోషం దూరం

పురుష జాతకంలో శుక్రుడు వివాహ కారకుడు. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా, పాప గ్రహాలతో కలిసినా కళత్ర దోషం ఏర్పడి పెళ్లి ఆలస్యమవుతుంది. ఈ దోషం పోవడానికి శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించాలి. తెల్లటి వస్త్రాలు ధరించడం, మొలకలు వచ్చిన బొబ్బర్లను దానం చేయడం శుభప్రదం. లలితా సహస్రనామ పారాయణ చేస్తే శుక్ర గ్రహ దోషాలు తొలగి, వైవాహిక జీవితం సుఖమయం అవుతుంది. పరులకు సహాయం చేస్తే శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు.
News March 20, 2026
హెడ్ ఇంజూరీ.. ‘గోల్డెన్ అవర్’ కీలకం

తలకు తీవ్ర గాయమైనప్పుడు తొలి 60 నిమిషాలు అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీన్నే ‘గోల్డెన్ అవర్’ అంటారు. ‘ఈ గంటలో ప్రతి నిమిషంతో పోటీ పడి బాధితులను ఆసుపత్రికి తరలించాలి. ప్రధానంగా బ్లీడింగ్ అదుపు చేయాల్సి ఉంటుంది. పేషంట్‌ను తరలించే సమయంలోనూ మెడ కదలకుండా చూసుకోవాలి. గంటలోపు చికిత్స అందిస్తే సాధ్యమైనంతవరకు ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు’ అని తెలిపారు.
* ఇవాళ వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్‌నెస్ డే
News March 20, 2026
తొలిసారి రూ.93కు చేరిన రూపీ విలువ

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇవాళ మరింత క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. 92.92 వద్ద ఉన్న రూపీ విలువ ఎర్లీ ట్రేడ్‌లో పడిపోయి 93కు చేరింది.


