News November 8, 2024
తిరుమలలో అన్యమతస్థులపై వేటు?
AP: తిరుమలలో అన్యమతస్థుల అంశం ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. గతంలో అన్యమత ఉద్యోగులను గుర్తించి జాబితా రెడీ చేశారు. అయితే వారిని తిరుమల నుంచి తప్పించే చర్యలు మాత్రం ముందుకు సాగలేదు. ఇటీవల టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్యమతస్థుల స్వచ్ఛంద బదిలీలకు అవకాశం కల్పించి పంపించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 8, 2024
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం
TG: యాదాద్రి ఆలయం పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిపిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News November 8, 2024
ఇంట్లో ఈ మొక్కలుంటే ఆరోగ్యమే!
గాలిని శుద్ధిచేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించే మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పైడర్ ప్లాంట్ ఇంట్లోని కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ & జిలీన్లను పీల్చుకుని గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇవి సురక్షితమైనవని చెప్పారు. బెస్ట్ బెడ్రూమ్ మొక్కలివే.. లావెండర్, అలోవెరా, జాస్మిన్, స్నేక్ ప్లాంట్, ఇంగ్లీష్ IVY.
News November 8, 2024
మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు: మహిళా కమిషన్
మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదని, ఇది బ్యాడ్ టచ్ కిందకే వస్తుందని UP మహిళా కమిషన్ తెలిపింది. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలని, టైలరింగ్ షాపులో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల శిరోజాలనూ పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని UP ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.