News May 23, 2024
పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటు?
AP: మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల(M) పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడం సీసీ ఫుటేజీలో రికార్డయింది. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్వోని EC ఆదేశించింది. కాగా MLA పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News January 10, 2025
నేడు TTD ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 10, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
News January 10, 2025
బీజేపీ నేత ఇంట్లో మొసళ్లు.. ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్
మధ్యప్రదేశ్కు చెందిన BJP Ex MLA హర్వంశ్ సింగ్ ఇంట్లో రైడ్ చేయగా ₹3 కోట్ల డబ్బు, బంగారం-వెండి, బినామీ కార్లతోపాటు 3 మొసళ్లు దొరకడంతో IT అధికారులు అవాక్కయ్యారు. సాగర్ నగరంలో హర్వంశ్ సింగ్తోపాటు బీడీ వ్యాపార భాగస్వామి రాజేశ్ కేశర్వాని ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. వీరు ₹155 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు అధికారులు వెల్లడించారు. రాజేశ్ ఒక్కడే ₹140 కోట్లు ఎగ్గొట్టినట్టు తెలిపారు.