News May 24, 2024

ఆ బస్సుల పరిస్థితేంటో..!

image

TG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తుక్కు పాలసీ వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది. నిబంధనల ప్రకారం 15 ఏళ్లకు మించి వయసున్న వాహనాలను తుక్కుగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి నాటికి TGSRTCలో 9004 బస్సులున్నాయి. వీటిలో జంటనగరాల పరిధిలో 15ఏళ్లకు పైబడిన బస్సులు 637 ఉన్నాయి. ఇక 14ఏళ్లుగా నడుస్తున్నవి 330 ఉన్నాయి. ఇప్పటికే బస్సుల కటకటతో ఉన్న TGSRTC వీటి విషయంలో ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News

News January 14, 2025

అయ్యప్పకు తిరువాభరణాలు అలంకరించి..

image

శబరిమల కొండల్లో మకరజ్యోతి సాక్షాత్కారమైంది. అంతకుముందు పందళ రాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానానికి చేరుకొని మణికంఠుడికి సమర్పించారు. పూజారులు వాటిని అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామి సన్నిధి తలుపులు తెరుచుకోగానే మరోవైపు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో భక్తులంతా జ్యోతిని దర్శించుకొని పులకించిపోయారు.

News January 14, 2025

యూజీసీ నెట్ కొత్త తేదీలివే..

image

రేపు జరగాల్సిన యూజీసీ నెట్-2025 పరీక్షను <<15149513>>వాయిదా<<>> వేసిన NTA తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సంక్రాంతి సందర్భంగా 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ నిన్న NTA ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

News January 14, 2025

నా మనసులో గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక స్థానం: చెర్రీ

image

గేమ్ ఛేంజర్ మూవీకి తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. తనతో పాటు ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇకపైనా తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను గర్వపడేలా చేస్తానని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. చివరిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్‌కు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు.