News July 18, 2024
హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అంటే?

మన దేశంలో రెండు రకాల రిజర్వేషన్లు(హారిజాంటల్, వర్టికల్) అమలులో ఉన్నాయి. SC, ST, OBC వారికి ఇచ్చేవి వర్టికల్ రిజర్వేషన్లు. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కిందకి వస్తాయి. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మహిళలు, ఎక్స్పీరియన్స్, ట్రాన్స్జెండర్, వికలాంగులకు కల్పించేవి. ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) కిందకి వస్తాయి.
Similar News
News December 21, 2025
బర్త్డే విషెస్.. థాంక్స్ చెప్పిన జగన్

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పెషల్ డేను ఉత్సాహంగా నిర్వహించి, YCP కుటుంబం చూపించిన ప్రేమ, అభిమానానికి ఆనందిస్తున్నానని తెలిపారు. వారి మద్దతు తనకు గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, AP గవర్నర్ అబ్దుల్ నజీర్, PCC చీఫ్ షర్మిల, TG Dy.CM భట్టిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పారు.
News December 21, 2025
సండే స్పెషల్.. OTTలో ఈ సినిమా చూశారా?

ప్రియదర్శి, ఆనంది కాంబినేషన్లో తెరకెక్కిన ‘ప్రేమంటే’ చిత్రం NETFLIXలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో భార్యాభర్తలుగా హీరోహీరోయిన్ల నటన మెప్పిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్. వెన్నెల కిశోర్, యాంకర్ సుమ రోల్స్ నవ్వులు పూయిస్తాయి. ఈ డీసెంట్ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చు. కాగా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది.
News December 21, 2025
VB-G RAM G బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

VB-G RAM G బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదలకు 125 రోజుల పనిదినాలను ఈ పథకం కింద అందిస్తారు. ఫారెస్ట్ ఏరియాల్లో జీవించే షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీలకు 150పనిదినాలు కల్పించేలా చట్టంలో NDA ప్రభుత్వం మార్పులు చేసింది. UPA హయాంలో 100రోజుల కనీస పనిదినాల లక్ష్యంతో తీసుకొచ్చిన MGNREGA పథకాన్ని కేంద్రం ఇటీవల రద్దు చేయడం తెలిసిందే.


