News April 9, 2025

HSRP నంబర్ ప్లేట్లు అంటే..

image

*అల్యూమినియం, రెట్రో రిఫ్లెక్టివ్ షీట్లు ఉపయోగించి నాన్-టాంపరబుల్ డిజైన్‌లో రూపొందిస్తారు. ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి.
*దొంగిలించినా ఈజీగా వాహనాలను ట్రాక్ చేయవచ్చు.
*రాత్రిపూట కాంతిని ప్రతిబింబిస్తాయి కాబట్టి రోడ్డు భద్రతలో సహాయపడుతుంది.
*ఇందులోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్‌లో వాహన సమాచారం స్టోర్ అవుతుంది. దీని ద్వారా నంబర్ ప్లేట్‌ను ఈజీగా స్కాన్ చేయవచ్చు.

Similar News

News October 24, 2025

దూసుకొస్తున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని APSDMA తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందంది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్రలో శనివారం భారీ, ఆదివారం అతిభారీ, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.

News October 24, 2025

సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సూచిస్తున్నారు.

News October 24, 2025

న్యూస్ రౌండప్

image

AP: కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా బోల్తా పడిన క్రేన్, ఆపరేటర్‌కు గాయాలు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
● బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి పార్థసారథి
● ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మృతిపై వైసీపీ చీఫ్ జగన్ సంతాపం
TG: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క
● మూడో వన్డే కోసం సిడ్నీకి చేరుకున్న టీమ్ఇండియా