News May 14, 2024

మోదీ ఆస్తులు ఎన్నంటే?

image

ప్రధాని మోదీ BJP నుంచి MP అభ్యర్థిగా వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తన చేతిలో రూ.52,920 నగదు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకు అకౌంట్లో రూ.80,304, FD రూ.2,85,60,338, 4 గోల్డ్ రింగ్స్(రూ.2.67లక్షలు), పలు ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం కలిపి సుమారు రూ.3కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. కాగా.. తన సతీమణి ఆస్తులను ఆయన పేర్కొనలేదు.

Similar News

News January 10, 2025

258మంది పాకిస్థానీలను వెళ్లగొట్టిన 7 దేశాలు

image

వివిధ అభియోగాలున్న 258మంది పాకిస్థానీ పౌరుల్ని 7 దేశాలు తమ భూభాగం నుంచి వెళ్లగొట్టాయి. పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం.. సౌదీ అరేబియా అత్యధికంగా 232మందిని, యూఏఈ 21మందిని.. చైనా, ఇండోనేషియా, సిప్రస్, నైజీరియా, ఖతర్ తలా ఒకరిని తిప్పి పంపించాయి. వీరిలో ఏడుగురు యాచకులు ఉండటం గమనార్హం. 258మందిలో 16మందికి వీసా గడువు లేకపోవడంతో కరాచీకి రాగానే పాక్ అధికారులు అరెస్ట్ చేశారు.

News January 10, 2025

భార్య వైపు ఎందుకు తదేకంగా చూడకూడదు?: గుత్తా జ్వాల

image

వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మండిపడ్డారు. ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. భార్య వైపు భర్త ఎందుకు తదేకంగా చూడకూడదు? ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News January 10, 2025

FLASH: కేటీఆర్‌పై కేసు నమోదు

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-కార్ రేసు వ్యవహారంపై నిన్న ఏసీబీ అధికారులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.