News August 18, 2025
‘కూలీ’, ‘వార్-2’ 4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ రూ.275 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాయి.
Similar News
News August 18, 2025
GOOD IDEA: నాయకులారా.. మీరూ ఇలా చేయండి!

TG: ప్రజా ప్రతినిధులను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలను తీసుకొస్తుంటారు. వీటికి బదులు పుస్తకాలు, రగ్గులు తీసుకొస్తే పేదలకు పంచేందుకు ఉపయోగపడుతాయని కొందరు పిలుపునిచ్చారు. అయితే కాస్త కొత్తగా ఆలోచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. శాలువాలను పిల్లల డ్రెస్సులుగా మార్చారు. ‘Honour to Humanity’ పేరిట పేద పిల్లలకు వీటిని అందించనున్నారు. దీనిని అంతా ఫాలో అవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
News August 18, 2025
కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.
News August 18, 2025
యూరియా కోసం కాంగ్రెస్ MPల నిరసన

TG: రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు భవనం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రమంత్రి నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని వారు కోరనున్నారు. యూరియాపై జీరో అవర్‌లో ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు.