News April 24, 2024

బాలకృష్ణ కూతురు, అల్లుడి ఆస్తులు ఎంతంటే?

image

AP: హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, అల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పేరిట రూ.393.41 కోట్ల ఆస్తులున్నాయి. భరత్‌ పేరిట రూ.16.89 కోట్ల చరాస్తులు, రూ.183.95 కోట్ల స్థిరాస్తులు.. తేజస్విని పేరుతో రూ.48.36 కోట్ల చరాస్తులు, రూ.44.20 కోట్ల స్థిరాస్తులున్నాయి. భరత్‌కు 7 కేజీల గోల్డ్, 51 కేజీల సిల్వర్.. తేజస్వినికి 5.3 కేజీల బంగారం, 52.50 కేజీల వెండి ఉంది.

Similar News

News February 16, 2026

ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

image

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం(ఫొటోలో)
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త, Ex MP లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు

News February 16, 2026

UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

image

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.

News February 16, 2026

పాకిస్థాన్‌పై గెలుపు.. ఇండియా సరికొత్త రికార్డు!

image

T20 WCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా <<19153355>>అద్భుత విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. పాక్‌తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్‌పై శ్రీలంక, ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.