News April 26, 2024

సీబీఐ మాజీ జేడీ ఆస్తులు ఎంతంటే?

image

AP: సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ తరఫున విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబ ఉమ్మడి ఆస్తి రూ.11.81 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. 2019లో ఆయన ఆస్తులు రూ.8.6 కోట్లుగా ఉండగా, ఐదేళ్లలో రూ.3.21 కోట్లు పెరిగాయి.

Similar News

News January 29, 2026

నెల్లూరు జిల్లాలో డబ్బులు ఇవ్వందే పని చేయరు..!

image

నెల్లూరు జిల్లాలో కరెంటోళ్లు మామూళోల్లు కాదు. గ్రామాల్లో వారు చెప్పిందే వేదం. ఎప్పుడొస్తే అప్పుడే పని. అప్పటి వరకు ప్రమాదమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పని చేస్తే వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే తిరిగి ముఖం కూడా చూడరు. జిల్లాలో 247 మంది లైన్‌మెన్లకు 50మందే ఉండటంతో వీరికి డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడం లేదు. మీ ఏరియాలో లైన్‌మెన్ పనితీరుపై కామెంట్ చేయండి.

News January 29, 2026

మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

image

TG: మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నిన్న 40 లక్షల మంది గద్దెలను దర్శించుకున్నారు.

News January 29, 2026

CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>CLRI<<>>) 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. Jr. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.53,628, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.39,545, MTSకు రూ.35,973 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://clri.org