News April 24, 2024
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు ఎంతంటే?

TG: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట దాదాపు రూ.1250 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య సంగీతా రెడ్డి పేరిట రూ.3,203 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తనకు సొంత కారు కూడా లేదని పేర్కొన్నారు. తనపై నాలుగు క్రిమినల్ ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు.
Similar News
News December 9, 2025
స్క్రబ్ టైఫస్పై ఆందోళన వద్దు: కాకినాడ కలెక్టర్

స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ షాన్మోహన్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇది వైరస్ కాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని తెలిపారు. పురుగు కుట్టినట్లు అనుమానం ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, సరైన చికిత్సతో ఇది పూర్తిగా నయమవుతుందని పేర్కొన్నారు. లక్షణాలున్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాన్నారు.
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 9, 2025
TODAY HEADLINES

* తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు
* వికసిత్ భారత్లో తెలంగాణ భాగం: జిష్ణుదేవ్
* చైనా మోడల్లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్
* జనవరిలో దావోస్ పర్యటనకు CM CBN
* 25 ఏళ్ల నాటి పాలసీల వల్లే TGకి ఆదాయం: CBN
* వందేమాతరం ఒక మంత్రం: PM
* ప్లానింగ్ లేకపోవడంతోనే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్
* జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక


