News May 3, 2024

మేనకా గాంధీ ఆస్తులు ఎంతంటే?

image

బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. యూపీలోని సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె తన ఆస్తుల విలువ రూ.97.17 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.51.20 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.45.97 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తుల విలువ రూ.55.69 కోట్లు ఉండగా.. ఐదేళ్లలో 43శాతం పెరిగింది.

Similar News

News December 26, 2024

TODAY HEADLINES

image

* ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
* రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం
* రేపు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ
* ఘోర విమాన ప్రమాదం.. 42 మంది దుర్మరణం
* జానీ మాస్టర్‌పై పోలీసుల ఛార్జిషీటు
* ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
* ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
* అంబేడ్కర్‌కు క్రెడిట్ దక్కనివ్వని కాంగ్రెస్: మోదీ

News December 26, 2024

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్

image

TG: కర్ణాటకలోని బెలగావిలో గురువారం నుంచి జరిగే CWC సమావేశాల్లో పాల్గొనేందుకు CM రేవంత్ వెళ్లనున్నారు. ఉదయం 11 తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బెలగావికి పయనమవుతారు. వందేళ్ల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీజీ బెలగావిలోనే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘సత్యాగ్రహ బైఠక్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

News December 26, 2024

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమే బెస్ట్: మోహన్ లాల్

image

ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్‌ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.