News February 28, 2025

హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

image

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్‌ను నిలిపివేసిందని ఆరోపించారు.

Similar News

News February 28, 2025

గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించేలా..

image

AP: గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిపై PIT-NDPS చట్టం కింద కేసు పెట్టి ఏడాది పాటు జైలు శిక్ష వేస్తోంది. తొలిసారిగా విజయవాడ పోలీసులు ఇద్దరిపై అభియోగాలు మోపారు. జిల్లాల వారీగా గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల జాబితా తయారు చేస్తున్నారు. ఇక నుంచి అరెస్ట్ అయ్యాక బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడటం కుదరదని పోలీసులు వెల్లడించారు.

News February 28, 2025

సబ్ జైలుకు పోసాని.. ఖైదీ నంబర్ ఎంతంటే?

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఆ నంబర్ కలిసొచ్చిందంటూ జోకులు వేసుకుంటున్నారు.

News February 28, 2025

Stock Markets: బ్లడ్‌బాత్.. విలవిల

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్స్ మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 22,265 (-280), సెన్సెక్స్ 73,690 (-930) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంక్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.

error: Content is protected !!