News October 28, 2025
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.
Similar News
News October 28, 2025
పోలీస్ శాఖలో 11,639 ఖాళీలు

AP పోలీస్ శాఖలోని 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలున్నట్లు హోంశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, మెకానిక్, డ్రైవర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా అత్యధికంగా కానిస్టేబుల్(APSP) 4,587, కానిస్టేబుల్(సివిల్) 3,622, కానిస్టేబుల్(AR) 2000 ఖాళీలున్నాయి.
News October 28, 2025
CWCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) 22 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్‌లో ఏడాది కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://cwceportal.com/
News October 28, 2025
అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.


